పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం దర్శనానంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థించాలన్నారు. భక్తుల కోసం టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లను చేస్తున్నదన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను భక్తుల కొరకు కల్పించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. ఈ సౌకర్యాలను వారందరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఈ వాహన సేవలో చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. త్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ఆరని శ్రీనివాసులు, టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.