17న శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 136వ జ‌యంతి

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 17వ తేది తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 136వ జ‌యంతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం10 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. అనంత‌రం సాయంత్రం 6 నుంచి 8 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో సభా కార్యక్రమం నిర్వహిస్తారు.

Share this post with your friends