New Rules : దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా… రూల్స్‌ మారిపోయాయి…

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై వీఐపీ అయినా, వీవీఐపీ అయినా దర్శనం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ కొనాల్సిందేనని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. సిఫారసు లేఖలు, ప్రోటోకాల్ పేరుతో టికెట్ లేకుండా దర్శనాలు చేయడాన్ని పూర్తిగా నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ హుండీ ఆదాయం, నిర్వహణ నిధులు పెంచడమే లక్ష్యంగా ఈ నిబంధన అమలులోకి తీసుకొచ్చారు. సాధారణ రోజుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుండగా, వీఐపీ దర్శనాల వల్ల ఆదాయానికి గండి పడుతోందని అధికారులు గుర్తించారు. మరోవైపు భక్తుల సౌకర్యార్థం తిరుమల తరహాలో ఉచిత లడ్డు ప్రసాద విధానాన్ని ప్రారంభించారు. 500 రూపాయల అంతరాలయ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు టికెట్ స్కానింగ్ వద్దనే లడ్డు ప్రసాదం అందజేయనున్నారు. దీని వల్ల పారదర్శకత పెరిగి, భక్తులకు దర్శనం మరింత సులభంగా మారనుంది. అమ్మవారి దర్శనంలో సమానత్వమే ఈ నిర్ణయానికి అసలైన ఆధ్యాత్మిక సందేశం.

New Rules In Vijayawada Kanaka Durgamma Temple
New Rules In Vijayawada Kanaka Durgamma Temple

 

Share this post with your friends