మహారాష్ట్ర థానే జిల్లాలోని మీరా భయందర్‌లో ఒక గణేష్ మండపంలో జరిగిన ఘటన జనాలను నివ్వెరబోయేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గణేష్ మండానికి ఓ ఎలుక వచ్చింది. అక్కడ కొన్ని సెకన్ల పాటు గణపతి విగ్రహాన్ని దణ్ణం పెడుతూ కనిపించింది. ఇక అంతే ఈ ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. గణపతి వాహనం అయిన ఎలుక విగ్రహం పాదాల కింద రెండు కాళ్లపై నిలబడి మరీ ముందు రెండు కాళ్లను ఎత్తి వినాయకుడికి నమస్కరించింది. ఎలుక భక్తికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మండపంలో ఉన్న ప్రసాదాన్ని తీసుకోకముందు ఎలుక వినాయకుడికి దణ్ణం పెడుతున్న దృశ్యం అక్కడ ఉన్న సీసి కెమెరాలో రికార్డ్ అయింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గణపతికి ఎలుక నమస్కరిస్తూ పండల్ వద్ద ఉన్న ఒక లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లింది. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను మండప నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా తెగ వైరల్ అవుతోంది. దీనికి దాదాపు పది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎలుక మోదకాన్ని స్వీకరిస్తున్న వీడియో అయితే లక్ష వ్యూస్‌తో దూసుకెళుతోంది.