
చిత్తూరు జిల్లా కలిగిరికొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు (శుక్రవారం) మండలాభిషేక కార్యక్రమాలను అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ మండలాభిషేక కార్యక్రమానికి అంకురార్పణ నిర్వహిస్తారు. అనంతరం వివిధ పూజా కార్యక్రమాలను, హోమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ మండలాభిషేక కార్యక్రమాలు ఈ నెల 13వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 07.15 నుండి 11.00 గం.ల వరకు పుణ్యాహవచనంతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం ఆచార్య వరణము, వాస్తు హోమం, అకల్మష హోమం, సభ, పౌండరీ కాగ్ని ప్రతిష్ట, శాంతి హోమము, ధృవమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం, అలంకారం, విశేష పూజ నిర్వహిస్తారు.
సాయంత్రం 05.30 గం.ల నుండి 09.00 గం.ల వరకు అంకురార్పణం, ప్రధాన శాంతి హోమం, కళాపకర్షణం చేపడతారు. జూలై 12వ తేదీ శనివారం ఉదయం 08.00 – 12.00 గం.ల వరకు పుణ్యాహం, ఉత్సవమూర్తికి చతుర్థశ కళశ స్నపనం, పంచగవ్య క్షీర, జలాధివాసములు, అధివాసాంగ హోమం చేపడుతారు. సాయంత్రం 05.30 – 08.30 గం.ల వరకు సర్వదైవత్యం, హోమం, మహాశాంతి హోమం, ధాన్యాధివాసం నిర్వహిస్తారు.జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 06.00 – 07.30 గం.ల వరకు పుఅయాహం, పూర్ణాహుతి, ఉదయం 07.55 – 08.20 గం.ల వరకు ఉత్సవమూర్తికి కళా వాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం, ఉదయం 11.00 – 12.00 గం.ల వరకు శాంతి కళ్యాణం, సాయంత్రం 05.00 – 06.30 గం.ల వరకు గరుడ సేవను నిర్వహించనున్నారు.
