
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 06 నుండి 15వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహించారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
వాహన సేవల వివరాలు
07-06-2025 ధ్వజారోహణం – పెద్దశేష వాహనం
08-06-2025 చిన్నశేష వాహనం, హంస వాహనం
09-06-2025 సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
10-06-2025 కల్పవృక్ష వాహనం, శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
11-06-2025 మోహినీ అవతారం, గరుడ వాహనం
12-06-2025 హనుమంత వాహనం, గజ వాహనం
13-06-2025 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
14-06-2025 రథోత్సవం, అశ్వవాహనం
15-06-2025 చక్రస్నానం ధ్వజావరోహణం
