ఈ అమ్మవారిని తిలకించేందుకు కిలోమీటర్ల కొద్దీ జనం..

దుర్గాపూజ అనగానే మనకు గుర్తొచ్చేది కోల్‌కతా. దేశంలోనే ఇక్కడ జరిగినంత గొప్పగా నవరాత్రి ఉత్సవాలు మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంతే పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌ని మినీ కోల్‌కతాగా అభివర్ణిస్తూ ఉంటారు. కోల్‌కతాలోని కాళీఘాట్ దేవాలయం మాదిరిగానే ఇక్కడ కూడా కాళీమాత ఆలయం ఉంది. ఇక్కడ జరిగే పండల్ పూజను తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తుంటారు. నవరాత్రి వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కిలోమీటర్ల కొద్దీ క్యూ కడతారు.

ఢిల్లీలోని ఈ ఆలయం గురించి చెప్పాలంటే.. మొదటగా ఇక్కడ శివుడి ఆలయాన్ని 1973లో నిర్మించి.. ఆ తరువాత ఈ ఆలయంలో మహాకాళి దేవి, శ్రీ కృష్ణుడు విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించారు. ప్రతి ఏటా నవరాత్రుల సమయంలో ఇక్కడ పండల్ అలంకరిస్తారు. తొలిసారిగా ఇక్కడ 1977లో దుర్గాపూజ నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. చిత్తరంజన్ పార్క్‌లో బెంగాలీ ఆహారంతో పాటు మార్కెట్ కూడా నిర్వహిస్తారు. ఇక ఈ సమయంలో ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

Share this post with your friends