శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులకు కీలక సూచన

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వచ్చేవారికి ఇది ఒకింత బాధ కలిగించే విషయమే. ఎందుకంటే అందరికీ శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనానికి డబ్బులు వెచ్చించే స్తోమత ఉండకపోవచ్చు. అసలేంటా బాధ కలిగించే విషయం అంటారా? తాజాగా శ్రీశైలం దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ వారం అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకూ ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. దీనికి ఒక కారణం ఉంది. ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లు తెరిచారు. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. మరోవైపు వీకెండ్స్‌లో భక్తుల రద్దీ బాగా పెరిగింది.

శ్రీశైలానికి భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అలాగే నిర్వహణ భారం పెరగకుండా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 16 నుంచి 19 వకూ అది కూడా దాదాపు రెండు గంటల పాటు ఉచిత దర్శనాన్ని రద్దు చేశారు. మధ్యాహ్నం 1:45 నుంచి 3:40 గంటల మధ్య భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉండదు. శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Share this post with your friends