22న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణం

శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మే 22వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

19-05-2025

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం – పెద్దశేష వాహనం

20-05-2025

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం – హంస వాహనం

21-05-2025

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

22-05-2025

ఉదయం – కల్పవృక్ష వాహన

సాయంత్రం – ఆర్జితకళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం

23-05-2025

ఉదయం – మోహినీ అవతారం

సాయంత్రం – గరుడ వాహనం

24-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజ వాహనం

25-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

26-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

27-05-2025

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

Share this post with your friends