కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో సెప్టెంబర్‌లో ప్రత్యేక పూజలు.. ఆన్‌లైన్‌లో టికెట్స్..

కాలడి శ్రీ ఆదిశంకర మఠం గురించి తెలిసే ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటరైంది. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొలారంలో కాలడి శ్రీ ఆదిశంకర మఠం ఉంది. ప్రతి నెలా ఇక్కడ ఏవో ఒక పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలోనూ జరగనున్నాయి. అయితే సెప్టెంబర్ మాసంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలకు భక్తులు పాల్గొనేందుకు గానూ ఆన్‌లైన్ ద్వారా టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలలో శ్రీ ఆదిశంకర మఠంలో శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ , సుదర్శన హోమం , ఆశ్లేష-నాగ పూజ , పుట్టినరోజు పూజ వంటి వివిధ రకాల సేవలు జరుగనున్నాయి.

వీటన్నింటిలోనూ భక్తులు పాల్గొనవచ్చు. అయితే దీనికి ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఆలయ సిబ్బంది పేర్కొంది. వచ్చే నేలలో ఆదిశంకర మఠంలో అత్యంత విశిష్టత కలిగిన మహాగణపతి హోమంను సైతం నిర్వహించనున్నారు. దీనిని వినాయక చవితి నాడు అంటే సెప్టెంబర్ 7న ఉదయం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8న శ్రీ రుద్రాభిషేకం.. సెప్టెంబర్ 17న పౌర్ణమి పూజ నిర్వహించున్నారు. ఈ ప్రత్యేక పూజలన్నింటిలో భక్తులు పాల్గొనేందుకు గానూ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. https://kaladyshankaramadomts.org/index.php/worldline/booking లింక్‌ని క్లిక్ చేసి బుక్ చేసుకోవాలని ఆదిశంకర మఠం నిర్వాహకులు చెబుతున్నారు.

Share this post with your friends