వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఎక్కువగా హైలైట్ అయింది లాల్ బాగ్చా రాజా గణపతి. స్వామివారు దేశంలోనే అత్యంత సంపన్న వినాయకుడిగా హైలైట్ అయ్యారు. నాటి నుంచి లాల్ బాగ్చా రాజా గణేషుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నారు. ఆయనకు రూ.400 కోట్లతో బీమా చేయించారు. ఈ వినాయకుడికి సంబంధించి ప్రతిరోజూ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. డ్రోన్ షాట్‌లు లేదా వీడియోల్లో ఈ ఉత్సవాల కారణంగా లాల్ బాగ్చా రాజా వినాయకుడు ఉన్న ప్రాంతమంతా ఎంత సందడిగా ఉందో చూపిస్తున్నాయి.
ఇక ఈ వినాయకుడి వద్ద అడుగడుగునా బౌన్సర్‌లను నియమించడం జరిగింది. గణపతి మండపం వద్దకు వచ్చే వారిని బౌన్సర్‌లు కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ బౌన్సర్‌ల తీరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక వీడియోలోని దృశ్యం నెట్టింట మంటలు పుట్టిస్తోంది. అదేంటంటే.. ఈ వినాయకుడి వద్ద ఓ సంపన్నుడి కుటుంబం సెల్ఫీలు తీసుకుంటోంది. మరోవైపు సామాన్యులు స్వామివారి చరణాలను తాకబోతుంటే బౌన్సర్‌లు దూరంగా లాగేస్తున్నారు. ఇదేమి న్యాయమంటూ పెద్ద ఎత్తున భక్తులు నిలదీస్తున్నారు. సామాన్యులకో న్యాయం.. సంపన్నులకో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు.