
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని అంతా భావిస్తుంటారు. ముఖ్యంగా సెలవు దినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఆ సమయంలో శ్రీవారి దర్శనం టిక్కెట్లు, పిల్లలతో వెళ్తే ఉండడానికి రూమ్ తో పాటు అప్పటికప్పుడు దొరకడం కష్టం. వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. ఒక్క మలయప్ప స్వామివారినే కాకుండా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేలా టూర్ ప్లాన్ సిద్ధం చేసింది. తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ పేరిట ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ సిద్ధం చేసింది.
మూడు రాత్రులు, రెండు పగళ్లుగా సాగే ఈ యాత్ర వారంలో ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. గురు, శుక్రవారాలు మినహా ప్రతి రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. తొలి రోజున హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రాత్రి 8:05 గంటలకు బయలుదేరి తదుపరి రోజున తెల్లవారి ఉదయానికి తిరుపతికి చేరుకుంటుంది. అక్కడ వసతి ఏర్పాటు చేస్తారు. హోటల్‌కు వెళ్లి ఫ్రెషప్ అయ్యి.. టిఫిన్ తిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేయించిన తర్వాత లంచ్ చేసి.. అక్కడ నుంచి శ్రీ కాళహస్తికి వెళ్ళాలి. ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకుని రాత్రికి తిరుపతికి చేరుకుని రాత్రి హోటల్‌లోనే బస చేయాలి. మూడో రోజున తెల్లవారుజామునే రెడీ అయ్యి తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తారు. అనంతరం తిరుపతిలోని హోట్‌కు చేరుకుని ఫ్రెష్ అయి చెకౌట్ చేసి సాయంత్రం 6:35 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
టూర్ ప్యాకేజీ విషయానికి వస్తే..
స్లీపర్ క్లాస్ ఒకొక్కరికి – రూ. 12,030.. ఇద్దరు ప్రయాణీకులకు – రూ.8,940.. ముగ్గురుకి – రూ.7,170.. 5-11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ అయితే – రూ. 4,710.. 5-11 ఏళ్ల పిల్లలకు విత్ అవుట్ బెడ్ అయితే – రూ.3,650
కంఫర్ట్ క్లాస్ అంటే థర్డ్ ఏసీ సింగిల్ షేరింగ్ – రూ. 13,810.. డబుల్ షేరింగ్ – రూ.10,720.. ట్రిపుల్ షేరింగ్ – రూ.8,940.. 5-11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ – రూ.6,480.. 5-11 ఏళ్ల పిల్లలకు విత్ అవుట్ బెడ్ – రూ.5,420
నేటి నుంచి అంటే మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటే IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను కానీ లేదంటే 9701360701 / 9281030712 నెంబర్లకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
