తిరుమలతో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ తక్కువ ఖర్చుతో దర్శించేందుకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్..

ఐఆర్‌సీటీసీ సామాన్యుల కోసం అదిరిపోయే ప్యాకేజ్‌ను ప్రకటించింది. తిరుమలతో పాటు తిరుపతి సమీపంలో ప్రముఖ ఆలయాలను సందర్శించాలనుకునే వారికి ఇది బాగా సహాయ పడుతుంది. ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనంతో పాటు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూర్ ఆలయాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు రాత్రి 8.05 గంటలకు కాచిగూడలో వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు.

అక్కడ రెడీ అవగానే శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం.. ఆపై భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం అనంతరం రాత్రికి తిరుపతిలో ఏసీ హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు. మూడో రోజు ఉదయం 8.30 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చేయిస్తారు. తిరుపతిలో మొత్తం ఏసీ వాహనంలో సైట్ సీయింగ్‌కి తీసుకెళతారు. శ్రీవారి దర్శనానంతరం సాయంత్రానికి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర వదిలేస్తారు. సాయంత్రం 6.35 గంటలకు టాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం.. మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.5,500 మాత్రమే. స్లీపర్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,590, ట్విన్ షేరింగ్‌కు రూ.5,800, సింగిల్ షేరింగ్‌కు రూ.7,670.. కంఫర్ట్ కేటగిరీలో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,370, ట్విన్ షేరింగ్‌కు రూ.7,570, సింగిల్ షేరింగ్‌కు రూ.9,450 చెల్లించాలి. https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌‌ను క్లిక్ చేస్తే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించవచ్చు.

Share this post with your friends