శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌య‌ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు అంకురార్ప‌ణ‌

అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణలో భాగంగా చేపట్టిన బాలాలయంకు అంకురార్పణ జరిగింది. మంగ‌ళ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. జూలై 30వ తేదీ ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతా ప్రతిష్ఠలు, సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి. ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తరిగొండ.. వాయల్పాడు (వాల్మీకిపురం) నుంచి గుర్రంకొండకు వెళ్ళే మార్గంలో దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జన్మించిన తరిగొండ వెంగమాంబ తన గ్రామానికి కీర్తిని తెచ్చిపెట్టింది.

Share this post with your friends