ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా 2025 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది. మూడు రోజుల్లోనే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. అయితే ఈ కుంభమేళాకు పెద్ద ఎత్తున సాధువులు కూడా వస్తున్నారు. వారిలో కొందరు సాధువులు హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా మనం ఒక టెకీ బాబా గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మరో సాధువు గురించి తెలుసుకుందాం. రష్యా నుంచి వచ్చిన 7 అడుగుల పొడవున్న సాధువు ఆత్మ ప్రేమగిరి మహారాజ్ మహాకుంభమేళాకు వచ్చిన భక్తులందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
బలమైన శరీరం, సాధారణ కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్ష మాల, పెద్ద జోలతో మస్కులర్ బాబా ప్రతి ఒక్కరిని తన వైపునకు తిప్పుకున్నారు. ప్రస్తుతం అతని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయనెవరో తెలిస్తే షాకవుతారు. ఒకప్పుడు ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. 30 సంవత్సరాల క్రితం ఆయన హిందూమతాన్ని స్వీకరించి.. దానిని ప్రచారం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన సాధువుగా మారి హిందూమతానికి ఊపిరి పోస్తున్నారు. తాజాగా ఆయన మహాకుంభమేళాకు రావడంతో అక్కడి వచ్చిన వారు ఆయనను తమ కెమెరాల్లో బంధించి నెట్టింట పోస్ట్ చేశారు.