
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు విభాగాలకు దాదాపుగా నిత్యం విరాళాలు అందుతూనే ఉంటాయి. తాజాగా టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం అందింది. ఆ తదుపరి రోజు టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.54 లక్షల విరాళం అందింది. మంగళూరుకు చెందిన శ్రీమతి విద్యా రవిచంద్రన్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు మంగళవారం రూ.54లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
