చిలుకు ద్వాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? దీనిని ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు?

అన్ని మాసాలలో అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని పేర్కొంటారు. ఈ మాసంలోనూ మరింత ప్రత్యేకమైన రోజులు కొన్ని ఉన్నాయి. కార్తిక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఉత్థాన ఏకాదశి, అలాగే చిలుకు ద్వాదశి. వీటిలో చిలుకు ద్వాదశి మినహా మిగిలినవన్నీటి గురించి మనకు తెలుసుకు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది చిలుకుద్వాదశి. క్షీరసాగర మథనం జరిగిన శుభదినాన్ని మనం చిలుకు ద్వాదశిగా పిలుస్తున్నాం. దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని, యోగీశ్వర ద్వాదశి, పావన ద్వాదశి, బృందావని ద్వాదశి అని కూడా పిలుస్తారు.

యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే రోజు కాబ్టటి యోగీశ్వర ద్వాదశి అని పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించి నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట. ఆ మరుసటి రోజే లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనానికి వచ్చాడట. కాబట్టి దీనిని బృందావని ద్వాదశిగా కూడా పిలుస్తారు. అంతేకాకుండా క్షీర సాగర మథిస్తుండగా ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభ తిథి కూడా ఇదేనని చెబుతారు.

Share this post with your friends