భక్తులకు ఆరోగ్యశాఖ సేవలు మరింత విస్తృతం

తిరుమలకు వేసవి, వీకెండ్ కారణంగా భక్తులు పోటెత్తారు. శనివారం స్వామివారిని 90,211 మంది భ‌క్తులు దర్శించుకున్నారు. క్యూలైన్లలో నిరంతరాయంగా తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, మైస్త్రీలు, ఇన్‌స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంట‌లు సేవలు అందిస్తున్నారు.

శ్రీవారి సేవకుల విశేష సేవ‌లు

తిరుమ‌ల‌లో ప్ర‌తిరోజూ దాదాపు మూడు వేల మంది శ్రీ‌ మలయప్ప స్వామివారి సేవ‌కులు భ‌క్తుల‌కు విస్తృత‌ సేవ‌లు అందిస్తున్నారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా నాలుగు షిప్టుల‌లో అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వీరి సేవ‌ల‌ను శ్రీ‌వారి సేవ గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

క్యూలైన్లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హ‌ణ‌

విజిలెన్స్, ఆలయ విభాగాలు ద‌ర్శ‌న‌ క్యూలైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. గత మూడు రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ద‌ర్శించుకున్నారు. కల్యాణకట్ట, మెడికల్, రేడియో, రిసెప్షన్ ,బ్రాడ్ కాస్టింగ్ త‌దిత‌ర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి.

Share this post with your friends