అగ్రరాజ్యంలో హరిహర క్షేత్రం..

అగ్రరాజ్యం అమెరికాలో హిందూ ప్రాబల్యం మరింత పెరుగుతోంది. ఇప్పటికే అక్కడి ప్రధాన నగరాల్లో హిందూ ఆలయాల నిర్మాణం జరిగింది. ఇక ఇప్పుడు మరో నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో భారీ ఆలయ నిర్మాణం జరగనుంది. ఇక్కడ హరిహర క్షేత్రం పేరిట శైవ, వైష్ణవ ఆలయాలను నిర్మించనున్నారు. కింగ్ రియా జార్జ్ టౌన్ లో హరిహర క్షేత్రం పేరిట ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. దీనిని ఇతర ఆలయాల కన్నా భిన్నంగా అద్భుతంగా నిర్వహించనున్నారు.

టెక్సాస్‌లోని హిందూ సమాజానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం 375 కింగ్ రియా జార్జ్ ప్రదేశంలో తాత్కాలికంగా ఒక బాలాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ బాలాలయ ప్రారంభోత్సవం సైతం పెద్ద ఎత్తున జరగనుంది. అక్టోబర్ 20న హరిహరక్షేత్రం బాలాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఆలయ ప్రారోంభోత్సవానికి స్థానికంగా ఆస్టిన్ నగరంలోని హిందూ కుటుంబాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అగ్రరాజ్యంలో వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

Share this post with your friends