
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 09.00 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 – 8.30 గం.ల మధ్య పుణ్యాహవచనం, నవగ్రహపూజ చేపట్టారు. తదుపరి 8.41 – 8.55 గంటల మధ్య రథారోహణం, 8.55- 8.58 గంటల మధ్య రథాగమనం నిర్వహించారు. 09.00 – 10.30 గంటలకు భక్తజనసమోహం మధ్య రథోత్సవం చేపట్టారు. సాయంత్రం 5.30 – 6.30 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.
కల్కి అలంకారంలో..
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. దీనిలో భాగంగా శనివారం రాత్రి 7.00 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 5.30 – 6.30 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 07.00 – 08.00 గంటల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించారు. ఇక నేడు స్వామివారి చక్రస్నానం, ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
