కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ గోమాత పాదయాత్ర

రాజకీయ పాదయాత్రల గురించి మనకు తెలిసిందే. ప్రాంతీయ పార్టీల వారైతే ఆ రాష్ట్రం వరకూ మాత్రమే పర్యటిస్తారు. ఆ మధ్య రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేపట్టారు. తాజాగా ఓ గోమాత ‘గోవు’ను పరిరక్షించుకోవాలన్న సందేశంతో పాదయాత్ర చేపట్టింది. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఎలాంటి సరైన రహదారి మార్గాలు లేని ఆ రోజుల్లో నడక అంటే కాస్త కష్టమే. దట్టమైన అడవులు, నదులు, కొండలు, కోనలు దాటుకుంటూ కాలినడకన సాగించిన యాత్రలు అత్యంత సాహసోపేతమైనవి.

ఇప్పుడు అంత కష్టం కాకున్నా కూడా అంత దూరం ఓ మూగ జీవి ప్రయాణమంటే మామూలు మాటలు కావు. ప్రస్తుతం గోమాత మహా పాదయాత్ర దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ పాదయాత్ర మార్చి నెలాఖరు నాటికి కన్యాకుమారి చేరుకోనుంది. హిందూ జీవన విధానంలో ఎంతో ప్రాధాన్యత, ప్రాశస్త్యం కల్గిన ‘గోవు’ను పరిరక్షించుకోవాలన్న సందేశంతో సాగుతున్న ఈ పాదయాత్రపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సంస్థ ఈ పాదయాత్ర చేపట్టింది. మొత్తం 14 రాష్ట్రాల మీదుగా 4,900 కి.మీ మేర సాగి చివరకు ఈ పాదయాత్ర కన్యాకుమారిలో ముగియనుంది.

Share this post with your friends