
తిరుపతి వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ఆలయాల్లో శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం ఒకటి. శనివారం ఈ ఆలయంలోని శ్రీ కోదండరామ స్వామివారికి ఓ భక్తులు బంగారు తులసి హారం సమర్పించాడు. బెంగళూరుకు చెందిన దాత ఒకరు బంగారు తులసి హారం బహుకరించారు. రూ.26 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు తులసి దళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కబడి చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ తులసీ హారంను దాత ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారాములు కొలువై ఉన్నారు. ఈ ఆలయం చారిత్రక పరంగానే కాకుండా మతపరమైన ప్రాధాన్యతకు ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. చోళుల కాలానికి చెందినదిగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో చోళుల కాలం నాటి నిర్మాణ నైపుణ్యానికి నిలువుటద్దంలా కనిపిస్తుంది. ఈ ఆలయంలో తన సైన్యం కోసం రావణుడి తమ్ముడు విభీషణుడు.. రాముల వారిని ఆశ్రయం కోరారని చెబుతారు.
