ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి అలంకారంలో మెరిసిపోయిన దుర్గమ్మ..

ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి అలంకారంలో దుర్గమ్మ మెరిసిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

గాయత్రి మంత్రం

“ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్”
వశిష్ఠ మహర్షికి వచ్చిన సందేహానికి బ్రహ్మ ఇచ్చిన సమాధానమిది. గాయత్రీలోనే సృష్టి రహస్యం దాగి ఉంది. గాయత్రీ మంత్రం నుంచి వేదాలు, క్రియలు, సమస్త శక్తులు ఉద్భవించాయి.
గాయత్రి మంత్రంలోని 24 శక్తులు..
వినాయకుడు – సఫలత శక్తి
నృసింహుడు – పరాక్రమ శక్తి
విష్ణుమూర్తి – పాలనాశక్తి
ఈశ్వరుడు – ఆత్మ పరాయణ శక్తి
శ్రీకృష్ణుడు – యోగశక్తి
రాధాదేవి – ప్రేమశక్తి
లక్ష్మీదేవి – సంపదశక్తి
అగ్నిదేవుడు – తేజశక్తి
మహేంద్రుడు – రక్షాశక్తి
సరస్వతి – విద్యాశక్తి
దుర్గాదేవి – దమనశక్తి
ఆంజనేయుడు – నిష్ఠాశక్తి
భూదేవి – ధారణాశక్తి
సూర్యుడు – ప్రాణశక్తి
శ్రీరాముడు – మర్యాదాశక్తి
సీతాదేవి – తపశ్శక్తి
చంద్రుడు – శాంతిశక్తి
యముడు – కాలశక్తి
బ్రహ్మ – సృష్టిశక్తి
వరుణుడు – దయాశక్తి
నారాయణుడు – ఆదర్శశక్తి
హయగ్రీవుడు – సాహనశక్తి
హంస – వివేకశక్తి
తులసీ మాత – సేవాశక్తి

గాయత్రి మహిమ ఏంటంటే.. గాయత్రి మంత్రం వలన ఆరోగ్యం, ఏకాగ్రత, ధైర్యం కలుగుతాయి. వేదాల్లోకెల్లా శ్రేష్ఠమైన మంత్రం గాయత్రి. “న గాయత్ర్యా పరమం మంత్రం, న మాతుః పరదైవతమ్”. గాయత్రి కన్నా శ్రేష్ఠమైన మంత్రం లేదు, తల్లి కన్నా గొప్ప దైవం లేదు.

Share this post with your friends