
నిన్న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చి భక్తులను తరింపజేసింది.
బాల రూపం..
బాల్యం దైవత్వానికి ప్రతీక. సంతానలేమి నివారణ, సౌభాగ్యం ప్రసాదనలో బాలాత్రిపురసుందరి ఆరాధన విశిష్ట స్థానం కలిగి ఉంది. నవరాత్రులలో శక్తి ఆరాధన చిన్న రూపం నుండి మహారూపం వరకూ సాగుతుంది. అందుకే మొదట బాల రూపమైన బాలా త్రిపురసుందరి ఆరాధన.
మంత్రోక్తి
మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా…
షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ…
జగద్ధాత్రీ లోకనేత్రీ సుధానిష్యంది సుస్మితా…
పరమేశ్వరవల్లభ్య దివ్యసౌభాగ్య సుప్రభా…
అలంకారం
అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిచ్చారు.
నైవేద్యం – కట్టె పొంగలి (నెయ్యి, పెసరపప్పు, బియ్యం, మిరియాలు, జీలకర్ర).
ఆరోగ్యానికి, శక్తివృద్ధికి ఈ నైవేద్యం ప్రత్యేకంగా సూచించబడింది.
ధ్యాన శ్లోకం
“హ్రీంకారాసన గర్భితానల శిఖాం…
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం…
శ్రీచక్ర సంచారిణీమ్”
త్రిపుర సుందరి దేవి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలను ఆధీనంలో ఉంచే దేవత.
బాలా త్రిపురసుందరి అవతారం
బ్రహ్మాండ పురాణం ప్రకారం భండాసురుని 30 మంది కుమారులను బాలా త్రిపురసుందరి ఒకే అర్థచంద్ర బాణంతో సంహరించింది.
బాల రూపమైనా శక్తి అమోఘం.
అమ్మవారి రథం హంసరథం — ఇది ప్రాణశక్తి ఆరాధనకు ప్రతీక.
బాలా ఆరాధన ఫలం
బాలాత్రిపురసుందరి మంత్రసిద్ధి పొందినవారే తర్వాత షోడశి ఆరాధన చేయగలరు.
రెండవ రోజు బాల పూజా ఫలితం –
“శతృక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై”
– శత్రు నాశనం, ధన, ఆయుష్షు, బల వృద్ధి.
ధ్యాన శ్లోకం
“అరుణకిరణ జాలైః అంచితావకాశా…
నివసతు హృది బాలా నిత్య కళ్యాణ శీలా”
