కేరళను చుట్టుముట్టిన వరదలు.. అనంత పద్మనాభస్వామి ఆలయంలో అద్భుతం..

మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి . అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి. స్వామివారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది. ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది. దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు, నిత్య పూజలు జరుగలేదు. అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట . అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారట . అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది.

మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది. స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అనీ తిరువనంతపుర ప్రజలు భయాందోళలను పొందారు. ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట. మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు. స్వామి వారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు. ఎక్కడా తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుభ్రపరచినట్లుగా పొడిగా, సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి. అంతే కాదు స్వామివారికి అలంకరించిన పూల మాలలు తాజాగా ఉన్నాయి . బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి. స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు..

Share this post with your friends