30 నుంచి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ

అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌ స్వామివారి ఆలయం మరో వేడుకకు సిద్ధమవుతోంది. ఈ ఆలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కోసం జూలై 30 నుంచి బాలాలయం నిర్వహించనున్నారు. ఈ బాలాలయం మూడు రోజుల పాటు అంటే ఆగ‌స్టు 1వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం జూలై 29న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హించ‌నున్నారు.

జూలై 30వ తేదీ ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠలు, సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు. జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి. ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Share this post with your friends