అయోధ్య రామాలయంలో తొలి దీపావళి.. దీపోత్సవానికి సరయూ నది సిద్ధం..

ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి ఆధ్యాత్మిక నగరంగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మాణంతో చిరకాల హిందువుల కల నెరవేరినట్టైంది. దేశం మొత్తం రామ జన్మ భూమి అయోధ్యలో కూడా దీపావళికి ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా సరయూ నదీ తీరంలో పెద్ద ఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. సరయూ నదీ తీరంలో మొత్తంగా 55 ఘాట్లు ఉన్నాయి. అన్ని ఘాట్ల వద్ద కలిపి మొత్తంగా 28 లక్షల 500 దీపాలను వెలిగించనున్నారు.

సరయూ నదీ తీరంలో దీపోత్సవం కోసం 30 వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వలంటీర్లుగా ఎల్‌అండ్‌టి, టాటా ఉద్యోగులతో పాటు సోన్‌పూర్ గ్రూపుకి చెందిన వారు ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ముఖ్య అతిథులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ అతిథులంతా ఇవాళ జరిగే రామ్ కథా పార్క్‌లోని టాబ్లా కార్యక్రమంలో పాల్గొననున్నారు. సుమారు 500 ఏళ్ల తర్వాత బాల రామయ్య ఆలయంలో తిరిగి దీపావళి జరుగుతోంది. దీంతో రామ జన్మభూమి ట్రస్ట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.

Share this post with your friends