కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి వచ్చిన మహిళా అఘోరీ..

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెళ్లిలో మల్లికార్జునస్వామిని ఒక మహిళా అఘోరి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ పురుష అఘోరాలను మాత్రమే వీక్షించిన స్థానికులు తొలిసారిగా మహిళా అఘోరీని చూసి ఆశ్చర్యపోయారు. దిగంబరంగా వచ్చిన మహిళా అఘోరీ శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి మనకు కాశీ, ఆ తరువాత మహా కుంభ మేళా సమయంలో అఘోరాలు కనిపిస్తారు. అలాగే వీరు శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మహిళా అఘోరి కొమురవెళ్లికి వచ్చారు.

అఘోరాలు శివభక్తి పరాయణులు. ఈ క్రమంలోనే వారు బంధాలన్నింటినీ త్యజించి దిగంబరునికి తమ జీవితాన్ని అంకితం చేస్తారు. నిత్యం శివనామస్మరణ చేస్తూ కాశీ, హిమాలయాల్లో తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఒళ్లంతా విభూది రాసుకుని రుద్రాక్ష మాల ధరించి ఉంటారు. అయితే వీరిలో రెండు రకాల వారున్నారు. కొందరు దుస్తులు చుట్టుకుంటారు. కొందరు మాత్రం దిగంబరులుగానే ఉంటాయి. అయితే దిగంబరుల్లో పురుషులే ఉంటారని తెలుసు. మహిళా అఘోరీలను చూడటం చాలా అరుదు. తొలిసారిగా మహిళా అఘోరీని కొమురవెళ్లి ప్రాంతవాసులు చూశారు. దీంతో వారంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Share this post with your friends