సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ

దసరా నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలన్నింటిలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శరన్నవరాత్రులు అనగానే గుర్తొచ్చే ఆలయాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ. అమ్మలగన్న అన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న మహాలక్ష్మీ దేవి అలంకారంలో అమ్మవారు మెరిసిపోయింది. ఇవాళ నవరాత్రులు ఏడవ రోజుకు చేరుకోవడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది.

సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తులను తెల్లవారుజామున అర్థరాత్రి ఒంటి గంట నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఇవాళ అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఆలయానికి వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో ఈ రోజు దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే అన్ని రకా విఐపి ,సిఫారసు లేఖలను ఆలయ అధికారులు రద్దు చేశారు.

Share this post with your friends