శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాల విరాళం

తిరుమల కొన్ని శతాబ్దాల అనంతరం అఖండాలు విరాళంగా అందాయి. అఖండాలు అంటే చాలా మందికి తెలిసి ఉండదు. శ్రీ మలయప్ప స్వామివారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలే ఈ అఖండాలు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో ఉన్నవి 300 సంవత్సరాల కాలం నాటివని చెబుతారు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా రాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతకాలానికి తిరిగి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అఖండాలు విరాళంగా అందాయి.

ఈ అఖండాలను విరాళంగా అందించింది కూడా మరెవరో కాదు.. మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి. ఆమె సోమవారం రెండు భారీ వెండి అఖండాల (అఖండ దీపాలు)ను విరాళంగా అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this post with your friends