
తిరుమల శ్రీవారికి దాదాపుగా నిత్యం ఏదో ఒక విరాళం అందుతూనే ఉంటుంది. టీటీడీకి చెందిన ఏదో ఒక విభాగానికి స్వామివారికి విరాళాలు అందిస్తూనే ఉంటారు. తాజాగా నాయుడుపేటకు చెందిన శ్రీ పోతిరెడ్డి లోకేష్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. దాత తరఫున ఆయన ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి కదిరి శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా విరాళం డీడీని అందజేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వేసవి సెలవుల ముగింపు కారణంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. 80,894 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 32,508 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే ఊహించని విధంగా హుండీ ద్వారా 4.30 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
