దేవాలయాలను పాదయాత్ర చేస్తే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర ఈ రోజుల్లో బాగా చర్చనీయాంశమైంది. దీంతో అసలెందుకు దేవాలయాలకు పాదయాత్ర నిర్వహిస్తారనే అంశం వైరల్ అవుతోంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి పవిత్ర స్థలానికి పాదయాత్ర చేయడం ద్వారా ఆత్మశుద్ధితో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందట. హిందూ మత గ్రంథాలలోనూ ఇలా దేవాలయాలను సందర్శిస్తే మోక్షం పొందుతారని నమ్మకం. ఎవరైతే కొండ కోనలను దాటుకుంటూ దైవ దర్శనం చేస్తే మరీ మంచిదని చెబుతారు. తద్వారా శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండటంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయట.

జ్యోతిషశాస్త్రంలో మతపరమైన తీర్థయాత్రలకు గొప్ప ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. దేవాలయాలకు పాదయాత్ర చేపట్టేవారికి గ్రహ దోషాలు తొలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేస్తే శని దోషం, ఏలిన నాటి శని ప్రభావంతో రాహు-కేతు దోషాలు సైతం తొలగిపోతాయట. అంతేకాకుండా తీర్థ యాత్రలు కుజ గ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి సైతం ఉపశమనం కలుగుతుంది. పితృదోషంతో బాధపడుతున్న వారికి, పూర్వీకుల ఆత్మ శాంతి కోసం మతపరమైన తీర్థయాత్రలు చేపట్టాలని సైతం ఇలా తీర్థయాత్రలు చాలా ప్రయోజనకరం. ఇలా చేస్తే పూర్వీకులు సంతోషించి ఆశీస్సులు అందజేస్తారట.

Share this post with your friends