
2025 జనవరి నెలలో మహా కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేళా సమయంలో ఎప్పుడూ బయటకు కనిపించని ఋషులు, సాధువులు ఈ సమయంలో మాత్రమే కనిపిస్తారు. వీరంతా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. కాబట్టి మహా కుంభ మేళా కార్యక్రమంలో తప్పక వీరంతా పాల్గొంటారు. అయితే మహా కుంభమేళా సమయంలో కిన్నార్ అఖారాలు బయటకు వస్తుంటారు. అసలు కిన్నార్ ఆఖారాలు ఎవరు? వీరు హిందూ మతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. విగ్రహారాధన గావిస్తూ ఉంటారు. జునా అఖారాకు అనుబంధంగా ఉన్న మూడవ లింగానికి కిన్నార్ అఖారా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది.
2019 సంవత్సరంలో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగిన విషయం తెలిసందే. ఈ సమయంలో కిన్నార్ అఖారాలు రావడం జరిగింది. కిన్నార్ అఖారా జునా అఖారాతో విలీనం చేయడం జరిగింది. వాస్తవానికి 2019 కుంభ మేళా సమయంలో అన్ని అఖారాలతో పోలిస్తే.. కిన్నార్ అఖారాలే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అఖారాల సమాజంలో కిన్నార్ చాలా ముఖ్యమైనదని చెబుతారు. దేశ వ్యాప్తంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మూడవ లింగానికి 13 అఖారాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇందులోనూ రెండు వర్గాలుంటాయి. ఒక వర్గం శివుడిని ఆరాధిస్తే.. మరో వర్గం విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది.
