
తిరుమల తిరుపతి దేవస్థానం వీలైనప్పుడల్లా డయల్ యువర్ ఈవో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. భక్తులు అడిగే సందేహాలన్నింటినీ తీర్చుతుంది. అలాగే భక్తుల కోరికలలో సాధ్యమైనంత మేర తీరుస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగానే అన్ని వివరాలను తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెలలో నిర్వహించనున్న డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నింటినీ టీటీడీ తెలియజేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం మే 24వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
