ఇంద్రకీలాద్రిపై భక్తులు తమ సేవలను అందించే అవకాశం..

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ కొలువైన క్షేత్రం. ఇక్కడ అమ్మవారి సేవ నిర్వహించాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఈ ఆలయంలో సేవ చేయడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. దుర్గమ్మ సన్నిధిలో ఉచితంగా సేవ చేయాలనుకునే భక్తులకు, భక్త బృందాలకు ఇక మీదట అధిక ప్రాధాన్యమిచ్చి సేవలను వినియోగించనున్నారు. ఇక వీరు చేయవలిసిందల్లా భక్తులకు తాగునీరు అందించడం, అన్నప్రసాద వితరణ, దర్శనం క్యూలైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరిచే ప్రదేశం వంటి చోట్ల సేవకుల సేవలను అధికారులను వినియోగించుకోనున్నారు.

ఇలా భక్తుల సేవలను వినియోగించుకోవడం ఇప్పటి వరకూ తిరుమలలోనే జరుగుతోంది. ఇకమీదట ఇంద్రకీలాద్రిపై కూడా జరుగనుంది. ఇలా సేవ చేయడానికి వచ్చే సేవకులు మొదటగా దేవస్థానం వెబ్ సైట్ www.kanakadurgamma.orgలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సేవ చేయాలనుకునే భక్తులు ముందుగా వాలంటీర్ విభాగంలో వాలంటీర్‌గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత తమ పేరు, ఫోన్ నంబర్, పూర్తి చిరునామా, ఫోటో ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అన్ని వివరాలతో కూడిన గుర్తింపు కార్డును జారీ చేశారు.

Share this post with your friends