పూరీ జగన్నాథ ఆలయంలో దేవస్నాన పౌర్ణమి.. గోప్య చికిత్స సేవలు

ఈనెల 22వ తేదీన పూరీ జగన్నాథ ఆలయంలో దేవస్నాన పౌర్ణమి. ఈ ఏడాది ఒనొసొనొ మందిరంలో 13 రోజులే గోప్య చికిత్స సేవలు. వేడుక అనంతరం చీకటి మందిరంలో 15 రోజుల పాటు జగన్నాథుడికి గోప్య చికిత్స సేవలు అందించడం ఆలయ సంప్రదాయం. తిథి వార నక్షత్రాలు, అమృత వేళలు దృష్ట్యా ఈ ఏడాది 13 రోజులే జగన్నాథుడికి గోప్య సేవలు.

ఈ ఏడాది పూరీ జగన్నాథుడి నేత్రోత్సవం రద్దు. ప్రతీ ఏటా జగన్నాథ రథయాత్రకి ముందు రోజున నేత్రోత్సవం, నేత్రోత్సవానికి ముందు రోజున ఉభా వేడుక చేపట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది జులై 7న పూరీ జగన్నాథ రథయాత్ర. తిథి వార నక్షత్రాల దృష్ట్యా ఈ ఏడాది జులై 6వ తేదీన ఉభా ఉత్సవం. ఒకే రోజు ఉభా, నేత్రోత్సవాలు కావడంతో సమయాభావం కారణంగా నవయవ్వన దర్శనం రద్దు.

Share this post with your friends