
శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ అదనపు ఈవో ఈ ఏర్పాట్లన్నింటినీ పరిశీలించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అటు తర్వాత ముఖ్యమంత్రివర్యులు వచ్చే మార్గాలను, ఆలయ పరిసరాలు, కల్యాణవేదిక, క్యూలైన్లు, భక్తులకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అటు తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో చర్చించారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
06.04.2025 (శ్రీరామ నవమి) – వృషభ లగ్నంలో ఉదయం 9.30 – 10.15 గంటల మధ్య ధ్వజారోహణం, సాయంత్రం 7 గంటలకు శేష వాహనం
07-04-2025 వేణుగాన అలంకారం హంస వాహనం
08-04-2025 వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
09-04-2025 నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం
10-04-2025 మోహినీ అలంకారం గరుడసేవ
11-04-2025 శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రాత్రి 8.30 గంటలకు), గజవాహనం.
12.-04-2025 రథోత్సవం
13-04-2025 కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
14-04-2025 చక్రస్నానం ధ్వజావరోహణం(రాత్రి 7 గంటలు)
15-04-2025 ——– పుష్పయాగం(సాయంత్రం 6 గంటలు).
