మీ అంతట మీరు చేసుకోగలిగే గ్రహణ శాంతి వివరాలు… మీ రాశి పరంగా…

జ్యోతిష్య శాస్త్రప్రకారం చంద్రగ్రహణం.. అన్ని రాశులపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ రోజున రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే కుంభరాశిలో రాహువు.. చంద్రుడు సంచరిస్తారు. మిథునంలో గురుడు… .. సింహరాశిలో కేతువుతో పాటు శుక్రుడు.. కుజుడు కన్యారాశిలో.. బుధుడు తులారాశిలో.. రాహువు కుంభరాశిలో .. శని దేవుడు .. మీన రాశిలో తిరోగమనంలో సంచరిస్తుండగా .. రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ ప్రభావం 48 రోజులు ఉంటుంది. వీటి వలన 12 రాశుల వారికి కచ్చితంగా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి.. గ్రహణం సమయంలో ఏదేవుడిని ఆరాధించాలి.. ఏ మంత్రం పఠించాలో తెలుసుకుందాం…

మేషరాశి : ఈ రాశి వారికి రాహుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు సుబ్రమణ్యస్వామిని పూజించాలి.

వృషభ రాశి : చంద్ర గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికీ ఆర్థిక సమస్యలు.. కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మహాలక్ష్మి అమ్మవారి ధ్యానం ఉత్తమం.

మిథున రాశి : చంద్రగ్రహణం సమయంలో నవగ్రహాల కదలికల ఆధారంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు అనవసర ఆలోచనలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున ఈ రాశి వారు ఉపశమనం.. శాంతి కోసం గ్రహణ సమయంలో శ్రీ విష్ణుమూర్తిని ప్రార్థించాలి.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రుడి ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ రాశి వారు పంచాక్షరి మంత్రాన్ని జపం చేయాలని పండితులు సూచిస్తున్నారు.

సింహరాశి : సంపూర్ణ చంద్రగ్రహణం వలన ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది.కావున ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పఠించాలి.

కన్యా రాశి : గ్రహణ సమయంలో ఈ రాశిలో కుజుడు సంచారం చేయుచున్నారు. అందువలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నరసింహ స్వామి వారి మంత్రాన్నిచదవాలి.

తులా రాశి : ఈ రాశిలో బుధుడు సంచరించే సమయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వలన .. ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. శివుడి ఆరాధన ఉత్తమం.

వృశ్చిక రాశి : రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రభావం లన వీరికి కొత్త సమస్యలు ఏర్పడవు కాని.. గతంలో ఉన్న సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అమ్మవారిని ధ్యానిస్తూ.. దుర్గా అమ్మవారి మంత్రాన్ని చదవడం వలన ఇబ్బంది ప్రభావం తగ్గుతుంది.

ధనుస్సు రాశి : ఈ రాశి వారు గ్రహణ సమయంలో కృష్ణుని పూజించాలి.

మకర రాశి : ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది, శని దేవుడిని ప్రార్థిస్తే ఇబ్బందులు తొలగుతాయి.

కుంభ రాశి: ఇదే రాశిలో రాహు గ్రస్తచంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ రాశి వారు మహాశివుని ఆరాధించాలి.

మీన రాశి : ఈ గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికి అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. వీటి వలన అశాంతి ఏర్పడుతుంది. ప్రశాంతత కోసం వీరు శ్రీమన్నారాయణుని పూజించాలి.

Share this post with your friends