
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్వామివారి వాహన సేవల వివరాలు తెలుసుకుందాం. శ్రీ పట్టాభిరామ స్వామి వారికి నిత్యం కైంకర్యాలతో పాటు ప్రతి ఏడాది చైత్ర మాసం నందు నవాహ్నిక బ్రహ్మోత్సవములు, శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలు, ఆశ్వీయుజ మాసంలో పవిత్రోత్సవాలు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 03 నుండి 12వ తేదీ వరకు తొమ్మిది రోజులు పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీరామచంద్రమూర్తి వివిధ వాహన సేవలను దర్శించుకుని భగవదనుగ్రహానికి పాత్రలు కావాలని టీటీడీ కోరుతోంది. ఇప్పటికే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరాయని టిటిడి పేర్కొంది.ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు :
తేదీ
03-04-2025
ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు),
రాత్రి – గజవాహనం
04-04-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం,
రాత్రి – హనుమంత వాహనం
05-04-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం,
రాత్రి – సింహ వాహనం
06-04-2025
ఉదయం – సర్వభూపాల వాహనం,
రాత్రి – పెద్ద శేష వాహనం
07-04-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం,
రాత్రి – చంద్రప్రభ వాహనం, పల్లకీలో మోహినీ అవతారోత్సవం
08-04-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
రాత్రి – కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం (రాత్రి 11 గంటల నుండి)
09-04-2025
ఉదయం – రథోత్సవం(ఉదయం 9.30 గంటలకు)
రాత్రి – ధూళీ ఉత్సవం( సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు)
10-04-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
రాత్రి – అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
11-04-2025
ఉదయం – వసంతోత్సవం (ఉదయం 8 గంటలకు), చక్రస్నానం ( మధ్యాహ్నం 12.05 గంటలకు)
రాత్రి – హంస వాహనం( రాత్రి 8 నుండి 10 గంటల వరకు), ధ్వజావరోహణం(రాత్రి 10 గంటలకు)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
