మే 8 నుంచి బూర‌గ‌మంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 8 నుండి 16వ తేదీ వరకు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 7న సాయంత్రం అంకురార్పణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 17వ తేదీన సాయంత్రం 5 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

08-05-2025 – సాయంత్రం – ధ్వజారోహణం

09-05-2025 – సాయంత్రం – శేష వాహనం

10-05-2025 – సాయంత్రం – హంస వాహనం

11-05-2025 – సాయంత్రం – హనుమంత వాహనం

12-05-2025 – సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

13-05-2025 – సాయంత్రం – పుష్ప పల్లకి

14-05-2025 – సాయంత్రం – సింహ వాహనం

15-05-2025 – సాయంత్రం – అశ్వవాహనం

16-05-2025 – ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – గజ వాహనం, ధ్వజావరోహణం

Share this post with your friends