
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 26 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. మార్చి 7న మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
26-02-2025 ధ్వజారోహణం(మేష లగ్నం) పెద్దశేష వాహనం
27-02-2025 చిన్నశేష వాహనం హంస వాహనం
28-02-2025 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
01-03-2025 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
02-03-2025 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
03-03-2025 హనుమంత వాహనం గజ వాహనం
04-03-2025 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
05-03-2025 రథోత్సవం అశ్వవాహనం
06-03-2025 చక్రస్నానం ధ్వజావరోహణం
