
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు :
తేదీ
03-04-2025
ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు),
రాత్రి – గజవాహనం
04-04-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం,
రాత్రి – హనుమంత వాహనం
05-04-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం,
రాత్రి – సింహ వాహనం
06-04-2025
ఉదయం – సర్వభూపాలవాహనం,
రాత్రి – పెద్దశేష వాహనం
07-04-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం,
రాత్రి – చంద్రప్రభవాహనం, మోహినీ అవతారం
08-04-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
రాత్రి – కల్యాణోత్సవం రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం (రాత్రి 11 గంటలకు)
09-04-2025
ఉదయం – రథోత్సవం(ఉదయం 9.30 గంటలకు)
రాత్రి – ధూళి ఉత్సవం( సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు)
10-04-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
రాత్రి – అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
11-04-2025
ఉదయం – వసంతోత్సవం (ఉదయం 8 గంటలకు), చక్రస్నానం ( మధ్యాహ్నం 12.05 గంటలకు)
రాత్రి – హంస వాహనం( రాత్రి 8 నుండి 10 గంటల వరకు), ధ్వజావరోహణం(రాత్రి 10 గంటలకు)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
