శ్రీశైలంలో శైలపుత్రీ దుర్గా అలంకారంలో బ్రమరాంబికా.. పురాణగాధ ఏంటంటే..

నవదుర్గలలో మొదటి అవతారం. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున పూజిస్తారు.

హిమవంతుని కుమార్తె, శివుని భార్య, గణపతి–సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి.

తలపై చంద్రవంక, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం.

వాహనం – వృషభం.

పురాణ గాథ..

దక్షయజ్ఞ అవమానంతో సతీదేవి దేహత్యాగం చేసింది.
తిరిగి పార్వతిగా పుట్టి శైలపుత్రీగా శివుణ్ణి వివాహం చేసుకుంది.

తత్త్వం
శైలపుత్రీ – మూలాధార చక్రాధిష్టాన దేవత.

యోగసాధనలో తొలి మెట్టు.
ఈ అమ్మవారి ఆరాధన ద్వారా స్వస్వరూప జ్ఞానం, ఉన్నత ఆధ్యాత్మిక స్థితి లభిస్తుంది.
ధ్యాన శ్లోకం

“వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం
వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్”
అర్థం – వృషభంపై విహరిస్తూ, కిరీటంలో చంద్రవంకతో, శూలం ధరించి భక్తుల కోరికలను తీర్చే శైలపుత్రీ దేవి.

Share this post with your friends