నేడు శ్రీశైలంలో బ్రహ్మచారిణి దుర్గా అలంకారం.. పురాణగాథ ఏంటంటే..

నవదుర్గల రెండవ అవతారం వచ్చేసి బ్రహ్మచారిణి.. చేతిలో జపమాల, కమండలం, కలశం, తెల్లని వస్త్రధారణతో అమ్మవారు చాలా అందంగా దర్శనమిస్తున్నారు. బ్రహ్మచర్యం, తపస్సు, ధైర్యానికి ప్రతీక.

పురాణ గాథ ఏంటంటే.. పార్వతీ దేవి శివుణ్ణి పొందాలనే సంకల్పంతో 5000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. మన్మథుణ్ణి శివుడు దహించినా, పార్వతీ తపస్సు ఆగలేదు. బ్రహ్మచారిణి రూపంలో కఠోర తపస్సు చేసింది. చివరికి ఆమె భక్తి, పట్టుదల శివుని గెలిపించింది.

ధ్యాన శ్లోకం..

“దధానాకర పద్మాభ్యా మక్షమాలా కమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా”
నవరాత్రుల్లో రెండో రోజు బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు.

Share this post with your friends