శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా భోగి తేరు

సంక్రాంతి పండుగను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా భోగి పండుగను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు వేసి.. చిన్నారులకు భోగి పండ్లు పోసి సందడిగా పండుగను నిర్వహించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం వచ్చేసింది. ఎక్కడెక్కడో సెటిల్ అయిన వారంతా ఏపీకి తిరిగి వచ్చేశారు. ఆలయాల్లో పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పించారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగి తేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ ముని కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ రావు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends