హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై క్లారిటీ ఇచ్చిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి

17 వ తారీఖు అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాల సమయంలో కోర్టుకు వెళ్ళడం ఆనవాయితీగా మారిందన్నారు. గతంలో విగ్రహాల నిమజ్జనం చేయడానికి అనుమతి ఇచ్చిందన్నారు. ఆ ఆదేశాల ప్రకారం మట్టి విగ్రహాలను, ఇతర విగ్రహాలను వేరు వేరుగా నిమజ్జనం చేయమని కోర్టు తెలిపిందన్నారు. నీటి పొల్యూషన్ జరగకుండా చూడాలని కోర్టు చెప్పిందని.. ఆదేశాల ప్రకారం నీరు కలుషితం కాకుండా చూస్తామని రాజవర్ధన్ తెలిపారు. కానీ అందుకు కొంత సమయం పడుతుందన్నారు.

మట్టి విగ్రహాలని పెట్టాలనేది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని రాజవర్ధన్ రెడ్డి అన్నారు. పాప్ విగ్రహాల తయారీకి ముడిసరుకును ప్రభుత్వమే అందించే ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కూడా సాగర్‌లో పాప్ విగ్రహాలని నిమర్జనం చేయడానికి ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలా చేయడంతో పాప్ విగ్రహాల నిమజ్జనం చేసిన తరువాత వాటిని ఈజీగా తొలగించే అవకాశం ఉంటుందన్నారు. నిన్నటి నుండి టాంక్ బండ్ పై విగ్రహాల నిమర్జనం చేయకూడదని ఫ్లెక్సీ పెట్టడంతో ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతోందని రాజవర్ధన్ రెడ్డి తెలిపారు.

Share this post with your friends