భారతీయుల చిరకాల కోరిక అయోధ్య రామమందర నిర్మాణంతో పూర్తైంది. ఈ ఏడాది జనవరిలో ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామాలయ ప్రారంభం నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. అయోద్య రామాలయం తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అందాల రాముడి ముందు దేశంలోనే ప్రసిద్ధి గాంచిన, ప్రేమకు చిహన్నమైన తాజ్ మహల్ సైతం చిన్నబోయింది. నిన్న మొన్నటి వరకూ ఆగ్రాలోని తాజ్‌మహల్ భారత్‌లోనే గొప్ప పర్యాటక కేంద్రంగా ఉండేది. విదేశాల నుంచి ఇక్కడకు ఎవరు వచ్చినా కూడా తాజ్‌మహల్‌ను దర్శించుకోకుండా వెళ్లరు.
అయితే తాజ్‌మహల్ స్థానాన్ని అయోద్య రామాలయం ఆక్రయించిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించారని ప్రభుత్వం ప్రకటించింది. వారిలో అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు, 3153 మంది విదేశీ పర్యాటకులు కూడా సందర్శించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను మొత్తం దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది. అంటే తాజ్‌మహల్‌తో పోలిస్తే అయోధ్యను సందర్శించిన వారి సంఖ్య కోటి మంది కంటే ఎక్కువగానే ఉంది. కేవలం 9 నెలల్లోనే తాజ్‌మహల్ రికార్డ్‌ను అయోధ్య రామ మందిరం అధిగమించిందని యూపీ ప్రభుత్వం వెల్లడించింది.