
ఆగష్టు 08వ తేదీన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా టీటీడీకి చెందిన 51 ఆలయాలలో సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సౌభాగ్యవతులకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుస్తక ప్రసాదాలు సదరు 51 ఆలయాలకు చేరుకున్నాయి. వరలక్ష్మీ వ్రతం రోజున టీటీడీ ఆలయాలలో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు. ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించిన 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు చేరుకున్నాయి. సదరు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుపతి నుంచి పంపిన సౌభాగ్యం మెటీరియల్‌ను సౌభాగ్యవతులకు అందించేందుకు ఆయా ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
