మే 11 నుంచి జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 10వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

11-05-2025

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 8.15 నుండి 9 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి – పెద్దశేష వాహనం

12-05-2025

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

13-05-2025

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – సింహ వాహనం

14-05-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – హనుమంత వాహనం

15-05-2025

ఉదయం – పల్లకీ ఉత్సవం

రాత్రి – గరుడ వాహనం

16-05-2025

ఉదయం – సర్వభూపాల వాహనం

రాత్రి – కల్యాణోత్సవం (సాయంత్రం 6 గంట‌ల‌కు),
గజ వాహనం (రాత్రి 8 గంట‌ల‌కు)

17-05-2025

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

18-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

19-05-2025

ఉదయం – చక్రస్నానం (ఉద‌యం 9 గంట‌ల‌కు)

రాత్రి – ధ్వజావరోహణం

మే 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

Share this post with your friends