18 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

18-02-2025
ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం)

రాత్రి – పెద్దశేష వాహనం

19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

20-02-2025
ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

23-02-2025
ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

25-02-2025
ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

26-02-2025
ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

Share this post with your friends